For Money

Business News

పబ్లిక్‌ ఇష్యూకు ఫెడ్‌ఫినా

ఫెడరల్‌ బ్యాంక్‌ అనుబంధ సంస్థ ఫెడ్‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఫెడ్‌ఫినా) పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. ఈ మేరకు మార్కెట్‌ సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఈ ఇష్యూ ద్వారా రూ.900 కోట్ల విలువైన కొత్త షేర్లు జారీ చేయనుంది. అలాగే ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) ద్వారా ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు.. 4,57,14,286 ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఇందులో ఫెడరల్‌ బ్యాంక్‌ 1,64,97,973 షేర్లను విక్రయిస్తుండగా, ట్రూ నార్త్‌ ఫండ్‌ VI ఎల్‌ఎల్‌పీ 2,9,216,313 షేర్లను విక్రయిస్తుంది. ధర నిర్ణయించిన తరవాత ఈ షేర్ల విలువ తెలుస్తుంది. పబ్లిక్‌ ఆఫర్‌ పూర్తయిన తరవాత కూడా ఫెడ్‌ ఫినాలో ఫెడరల్‌ బ్యాంకుకు 51 శాతం వాటా ఉంటుంది. కొత్త షేర్ల జారీ ద్వారా వచ్చే సొమ్మును మూలధన అవసరాలకు ఉపయోగిస్తరు.