For Money

Business News

పీఎఫ్‌ వడ్డీ రేటు పెంచుతారా?

EPFOకు చెందినఆర్థిక శాఖకు చెందిన ఫైనాన్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఆడిట్‌ కమిటీ రేపు సమావేశం కానుంది. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ పండ్‌ సభ్యులకు వడ్డీ రేట్లు పెంచాలా లేదా ఉన్న వడ్డీ రేట్లను కొనసాగించాలన్న అంశంపై ఈ కమిటీ రేపు సమీక్షించనుంది. సమీక్ష తరవాత తన సిఫారసులను EPFO సెంట్రల్ బోర్డ్‌ ట్రస్టీలకు సిఫారసు చేసింది. వచ్చే నెల 4-5న గౌహతిలో బోర్డు ట్రస్టీలు సమావేశం అవుతున్నారు. అదే రోజు లేదా ఒక రోజు ముందు కమిటీ తన సిఫారసులను ఇవ్వనుంది. ఈ వారం జరిగే పరపతి విధానంలో బ్యాంకు వడ్డీ రేట్లను ఆర్బీఐ పెంచినా…ఈపీఎఫ్‌పై వడ్డీ రేటును వెంటనే కమిటీ పెంచకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఈపీఎఫ్‌పై 8.5 శాతం వడ్డీ ఇస్తున్నారు. దీన్నే కొనసాగించే అవకాశముంది.