For Money

Business News

ఒక్కరోజే 5 శాతం జంప్‌

అంతర్జాతీయ మార్కెట్‌లో గోధుమ ధరలు భగ్గుమన్నాయి. ఏడాదిలో 25 నుంచి 30 నుంచి వరకు గోధుమ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఆహారధాన్యాల సరఫరాకు సంబంధించిన బ్లాక్‌ సీ ఎక్స్‌పోర్ట్‌ అగ్రిమెంట్‌ నుంచి రష్యా వైదొలగడంతో చికాగా గోధుమ ఫ్యూచర్స్‌ ధరలు 5 శాతం పెరిగాయి. అలాగే మొక్కజొన్న ధరలు కూడా 2 శాతం పైగా పెరిగాయిని రాయిటర్స్‌ పేర్కొంది. క్రిమియాపై ఉక్రెయిన్‌ దళాల దాడులకు నిరసనగా బ్లాక్‌ సీ డీల్‌ నుంచి గత శనివారం రష్యా ఈ నిర్ణయం తీసుకుంది. రష్యాను చర్యను అమెరికా ఖండించింది. ఆహార పదార్థాలను రష్యా ఆయుధాలుగా మల్చుకుంటోందని విమర్శించింది.