For Money

Business News

హైదరాబాద్‌లో వెబ్‌ వెర్క్స్‌ డేటా సెంటర్‌

ముంబైకి చెందిన వెబ్‌ వెర్క్స్‌.. దక్షిణాది రాష్ట్రాల్లో డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతోంది. హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరు నగరాల్లో రూ.1,450 కోట్ల పెట్టుబడితో ఈ డేటా కేంద్రాలను నెలకొల్పనుంది. తొలుత చెన్నైలో 20 మెగావాట్ల సామర్థ్యంతో కేంద్రాన్ని ప్రారంభించనుంది. ఆ తర్వాత హైదరాబాద్‌, బెంగళూరుల్లో 10 మెగావాట్ల సామర్థ్యం గల సెంటర్లను ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రాలు 2023 నాటికల్లా కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. కాగా డేటా కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి వెబ్‌ వెర్క్స్‌ ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాకు చెందిన ఐరన్‌ మౌంటెన్‌తో కలిసి రూ.1,086 కోట్ల (15 కోట్ల డాలర్లు)తో ఒక జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ఈ జేవీ ద్వారా కంపెనీ ప్రస్తుత మార్కెట్లతో కొత్త మార్కెట్లోకి కార్యకలాపాలను విస్తరిస్తోంది.