అదానీపై రాశారని జర్నలిస్ట్‌కు నోటీసు
దేశంలో అదానీ గుత్తాధిపత్యం గురించి పలు వెబ్సైట్లలో వార్త కథనాలు రాసిన ప్రముఖ జర్నలిస్ట్ రవి నాయర్‌కు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ వారంట్ జారీ చేశారు. అదానీ గ్రూప్ దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో అతనికి ఈ వారెంట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. దేశంలో వివిధ పారిశ్రామిక గ్రూప్‌లను కట్టడి చేసి దేశంలోని ఎయిర్‌పోర్టులు అదానీకి ఎలా కట్టబెట్టారో రవి నాయర్ రాశారు. అలాగే రఫెల్‌తో పాటు అదానీకి సంబంధించి పలు కథనాలు రాశారు. అయితే తాను పలు కథనాలు రాశానని.. ఏ కథనంపై పరువు నష్టం కేసు వేశారో తనకు నోటీస్ ఇవ్వలేదని రవి నాయర్ అంటున్నారు. తన కంప్లయింట్ కాపీగాని, నోటీసు కాని ఇవ్వలేదని తెలిపారు. తనపై వచ్చిన ఫిర్యాదు కాపీని తనకు ఇవ్వాల్సిన అవసరం ఉందని, అలాగే తనకు ముందస్తు నోటీసు కూడా ఇవ్వలేదన్నారు. దీనిపై ఈనెలాఖరులోగా గాంధీనగర్ కోర్టు ఎదుట తాను హాజరు అవుతున్నట్లు రవి నాయర్ తెలిపారు.