For Money

Business News

అదే స్థాయిలో రికవరీ

వాల్‌స్ట్రీట్‌లో ట్రేడింగ్‌ ఓ ప్రహసనంలా మారింది. అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ను ట్రంప్‌ తొలగిస్తారనే వార్తలతో నిన్న భారీగా క్షీణించిన మార్కెట్‌… ఇవాళ ఎలాంటి కారణం లేకుండా అదే స్థాయిలో పెరిగింది. మూడు ప్రధాన సూచీలు రెండు వాతంపైగా పెరిగాయి. ఐటీ, టెక్‌ షేర్ల సూచీనాస్‌డాక్‌ ఇపుడు 2.7 శాతం లాభంతో ట్రేడవుతోంది. పలు కంపెనీలు తమ ఫలితాలను ప్రకటించడం ప్రారంభమైంది. ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. అయినా సూచీలు భారీగా రికవరీ అయ్యాయి. డాలర్‌ ఇండెక్స్‌ 98పైనే ఉంటోంది. మరోవైపు క్రూడ్‌ రెండు శాతంపైగా పెరగ్గా, బులియన్‌ కూడా గ్రీన్‌లో ఉంది. ఇవాళ అమెరికా మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర ఇవాళ ఆసియా మార్కెట్ల సమయంలో 3500 డాలర్లను దాటి… ఇపుడు 3423 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.