For Money

Business News

వాల్‌స్ట్రీట్‌ అప్‌డేట్‌….

బైడెన్‌ ప్రతిపాదించిన కార్పొరేట్‌ పన్ను పెంపుపై కొనసాగుతున్న అనిశ్చితి స్టాక్‌ మార్కెట్‌లో కన్పిస్తోంది. ఇవాళ డాలర్‌ స్వల్పంగా తగ్గగానే… నాస్‌డాక్‌ గ్రీన్‌లోకి వచ్చేసింది. కాని డౌజోన్స్‌ అర శాతందాకా క్షీణించింది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా నష్టాల్లో ఉంది. కాని భారీగా కాదు. డాలర్‌ ఇండెక్స్‌ 0.2 శాతం పడిన వెంటనే మార్కెట్‌లో దాని ప్రభావం కన్పిస్తోంది. డాలర్ తగ్గిన వెంటనే క్రూడ్‌ ఆయిల్ జోరందుకుంది. ఇటీవల వరదల వల్ల బాగా దెబ్బతిన్న లూసియానా ప్రాంతంలో మళ్ళీ భారీ వర్షాలు. దీంతో క్రూడ్‌ ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. ఈ రెండు కారణాలతో క్రూడ్‌ ఆయిల్‌ ఇవాళ పెరిగి WTI క్రూడ్‌ 71 డాలర్ల వైపు, బ్రెంట్‌ క్రూడ్‌ 74 డాలర్ల వైపు పరుగులు పెడుతోంది. దీంతో కొన్ని ఎనర్జి షేర్లు లాభపడటంతో సూచీల పతనం తక్కువగా ఉంది. ఇక బులియన్‌ విషయానికొస్తే డాలర్‌ బలహీనంగా ఉండటంతో ఔన్స్‌ బంగారం మళ్ళీ 1800డాలర్ల స్థాయిని దాటింది. వెండి మాత్రం స్వల్పంగా పెరిగింది.