లాభాల్లో నుంచి నష్టాల్లోకి
ఉదయం నుంచి గ్రీన్‌లో ఉన్న అమెరికా ఫ్యూచర్స్ … మార్కెట్ ప్రారంభమైన తరవాత నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రధానంగా డౌజోన్స్ 0.6 శాతం నష్టపోగా, ఎస్ అండ్ పీ 500 సూచీ 0.3 శాతం నష్టంతో ఉంది. నాస్‌డాక్ మాత్రం నామమాత్రపు లాభాల్లో ఉంది. యాపిల్, మైక్రోసాఫ్ట్ షేర్లు ఒక శాతం పెరగ్గా.. మిగిలిన షేర్లు స్థిరంగా ఉన్నాయి. డాలర్ ఇవాళ గ్రీన్‌లో ఉంది. 104ని డాలర్ ఇండెక్స్ ఇవళ దాటే అవకాశముంది. క్రూడ్ ఆయిల్ ఇవాళ మరో రెండు శాతం పైగా నష్టపోయింది. బ్రెంట్ క్రూడ్ 103 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బులియన్ ఇవాళ కూడా డల్‌గా ఉంది.