For Money

Business News

లాభాల్లోకి వచ్చిన సూచీలు

ఆరంభంలో నష్టాల్లో ఉన్న టెక్‌, ఐటీ షేర్లు వెంటనే కోలుకున్నాయి. నష్టాల నుంచి కోలుకున్న ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ ఇపుడు 0.10 శాతం లాభాల్లో ఉండగా, నాస్‌డాక్‌ ఇంకా 0.12 శాతం నష్టాల్లో ఉంది. ట్రెండ్ చూస్తుంటే నాస్‌డాక్‌ కూడా తొందర్లోనే గ్రీన్‌లోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అమెరికాలోని టాప్‌ బ్యాంకులు అద్భుత ఫలితాలు ప్రకటించగా, ఇవాళ మోర్గాన్‌ స్టాన్లీ కూడా రికార్డు స్థాయి లాభాలను ప్రకటించింది. కంపెనీ పనితీరు అంచనాలను మించడంతో షేర్‌ ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతోంది. ఫలితంగా డౌజోన్స్‌ సూచీ 0.4 శాతం లాభంతో ఉంది. ఓ వ్యక్తి పొరపాటు కారణంగా కంపెనీ గైడెన్స్‌ రికార్డులో తప్పులు వచ్చాయని ఏఎస్‌ఎంఎల్‌ పేర్కొంది. ఈ కంపెనీ దెబ్బకు నిన్న రాత్రి అన్ని సెమి కండక్టర్‌ షేర్లు పడ్డాయి. ఇక కరెన్సీ విషయానికొస్తే డాలర్‌ నిలకడగా ఉంది. డాలర్‌ ఇండెక్స్‌ 103 ప్రాంతంలోనే ట్రేడవుతోంది. మరోవైపు క్రూడ్‌లో నష్టాలు కొనసాగుతున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 74 డాలర్ల వద్ద ఉంది. డాలర్‌ స్థిరంగా ఉండటంతో బులియన్‌ గ్రీన్‌లోకి వచ్చింది. ముఖ్యంగా వెండి ఒక శాతంపైగా లాభాల్లో ఉంది. ఔన్స్‌ బంగారం ధర ఏక్షణమైనా మళ్ళీ 2700 డాలర్ల స్థాయిని దాటేందుకు రెడీగా ఉంది.

Leave a Reply