తేరుకున్న నాస్డాక్
అమెరికా నష్టాల నుంచి కోలుకున్నాయి. ఆరంభంలో ఒక మోస్తరు నష్టాలతో ఉన్నాయి. చైనా గణాంకాలు నిరాశాజనకంగా ఉండటంతో ఉదయం చైనాతో పాటు హాంగ్కాంగ్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. అయితే జపాన్ నిక్కీ మాత్రం ఒక శాతంపైగా లాభంతో ముగిసింది. ఇక మధ్యాహ్నం నుంచి యూరప్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నా.. క్లోజింగ్ సమయానికల్లా లాభాల్లోకి వచ్చాయి. యూరో స్టాక్స్ 50 సూచీ 0.34 శాతం లాభంతో ముగిసింది. ఇవాళ అమెరికా కరెన్సీ మార్కెట్లో డాలర్ బలపడింది. డాలర్ ఇండెక్స్ 0.7 శాతంపైగా లాభపడి 106ని దాటింది. చైనా ఆర్థిక గణాంకాలు దారుణంగా ఉండటంతో క్రూడ్ ఆయిల్లో అమ్మకాల ఒత్తిడి బాగా పెరిగింది. బ్రెంట్ క్రూడ్ నాలుగు శాతంపైగా నష్టపోయింది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ 94 డాలర్ల ప్రాంతంలో ట్రేడవుతోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మన దేశంలో ఈక్విటీ మార్కెట్లు పనిచేయలేదు. మరోవైపు సింగపూర్ నిఫ్టి 50 పాయింట్ల లాభంతో ఉంది.