చల్లబడిన మార్కెట్లు
యూరప్ మార్కెట్లు దాదాపు స్థిరంగా ముగిశాయి. కొన్ని పెరిగినా..కొన్ని తగ్గినా..నామ మాత్రమే.యూరో స్టాక్స్ 50 సూచీ 0.21 శాతం లాభంతో ముగిసింది. అమెరికా మార్కెట్లలో కూడా జోరు తగ్గింది. నాస్‌డాక్ నామ మాత్రపు గ్రీన్లో ఉండగా… 0.55 శాతం లాభంతో ఎస్ అండ్ పీ 500 పరవాలేదనిపించింది. 0.57 శాతం లాభంతో డౌజోన్స్ ట్రేడ్ కావడం విశేషం. డాలర్ ఇవాళ మరికొంత బలహీనపడింది. డాలర్ ఇండెక్స్ 105 దిగువకు పడిపోయింది. దీంతో క్రూడ్ ఆయిల్ రెండు శాతంపైగా పెరిగింది. బ్రెంట్ క్రూడ్ ఈ మధ్య తగ్గినట్లే తగ్గి మళ్ళీ వంద డాలర్లకు చేరువైంది. బులియన్ మార్కెట్ డల్‌గాఉంది. నష్టాలు ఉన్నా… వెండిలోనే ఉన్నాయి. బంగారం 1800 డాలర్లపైనే ఉండటం విశేషం.