స్థిరంగా వాల్‌స్ట్రీట్
నిన్న దాదాపు 1.5 శాతం నష్టపోయిన అమెరికా ఈక్విటీ సూచీలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. అన్నీ రెడ్‌లో ఉన్నా… నష్టాలు నామమాత్రమే. నాస్ డాక్ మాత్రం 0.44 శాతం మైనస్‌లో ఉంది. యూరో మార్కెట్ గ్రీన్‌లో ముగిసింది. లాభాలు స్వల్పంగా తగ్గినా యూరో స్టాక్స్ 50 సూచీ 0.41 శాతం లాభంతో ముగిసింది. అలాగు జర్మనీ డాక్స్ కూడా 0.29 శాతం లాభంతో ముగిసింది. ఇవాళ వచ్చి అమెరికా జాబ్ డేటా చాలా ప్రోత్సాహకరంగా ఉంది. మార్చినెలలో విశ్లేషకుల అంచనాలకు మించి 4,31,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. దీంతో నిరుద్యోగం 3.6 శాతానికి క్షీణించింది. దీంతో డాలర్ బలపడింది. డాలర్ ఇండెక్స్ 0.25 శాతం పెరిగి 98.60 వద్ద ట్రేడవుతోంది. మే నెలలో వడ్డీ రేట్లను 0.5 శాతం పెంచుతారని 72 శాతం మంది అనలిస్టులు అంచనా వేస్తున్నారు. దీంతో బ్యాంకులు చాలా నెగిటివ్‌గా ఉన్నాయి. టెక్ షేర్లలో కాస్త ఒత్తిడి కన్పిస్తోంది.