For Money

Business News

ఒడుదుడుకుల మధ్య వాల్‌స్ట్రీట్‌

ఆరంభంలో నష్టాలు..తరవాత గ్రీన్‌లోకి… మళ్ళీ నష్టాల్లోకి… వెరశి వాల్‌స్ట్రీట్‌ స్థిరంగా ఉంది. లాభనష్టాల్లోకి జారుకున్నా… 0.2 శాతం లోపే. ట్రెజరీ బాండ్‌ ఈల్డ్స్‌ స్థిరంగా ఉండటం, డాలర్‌లో కూడా పెద్ద మార్పు లేకపోవడంతో ఈక్విటీ మార్కెట్లు కూడా స్థిరంగా ఉన్నాయి. టార్గెట్‌ కార్పొరేషన్‌ అంచనాలను తగ్గించడంతో రీటైల్‌ రంగానికి చెందిన షేర్లపై ఒత్తిడి పెరిగింది. డౌజోన్స్‌, ఎస్‌ అండ్ పీ 500, నాస్‌డాక్‌.. మూడు సూచీలు 0.2 శాతం లోపు నష్టాల్లో ఇపుడు ట్రేడవుతున్నాయి. బులియన్‌ మార్కెట్‌ గ్రీన్‌లో ఉన్నా ధరల్లో పెద్ద మార్పులేదు. అయితే క్రూడ్‌ మార్కెట్‌ భయపెడుతోంది. బ్రెంట్‌ క్రూడ్‌ 121, WTI క్రూడ్‌ 120 డాలర్ల ప్రాంతంలో ట్రేడవుతున్నాయి. అధిక ధరల వద్ద పలు వారాలు కొనసాగడంతో అనేక కంపెనీల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశముంది.