For Money

Business News

నాస్‌డాక్‌లో నాన్‌ స్టాప్‌ ర్యాలీ

వచ్చే వారం అంటే ఈనెల 18న ఫెడ్‌ వడ్డీ రేట్లను తగ్గించనుంది. పావు శాతమా, అరశాతమా అన్న అంశంపై సస్పెన్స్‌ ఉన్నా… వడ్డీ రేట్లు తగ్గడం ఖాయం. ఈ నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లు లాభాలతో సాగుతున్నాయి. ముఖ్యంగా నాస్‌డాక్‌లో నాన్‌ స్టాప్‌ ర్యాలీ నడుస్తోంది. అపుడపుడు చిన్న చిన్న బ్రేకులు పడినా… టెక్‌, ఐటీ షేర్లలో లాభాలు కొనసాగుతున్నాయి. ఇవాళ డాలర్‌ ఇండెక్స్‌ 101 దిగువకు పడిపోయింది. దీంతో ఈక్విటీ మార్కెట్‌పై ఇన్వెస్టర్లు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఇవాళ నాస్‌డాక్‌ కన్నా డౌజోన్స్‌ అధిక లాభాల్లో ట్రేడవుతోంది. నాస్‌డాక్‌, ఎస్‌ అండ్ పీ 500 సూచీలు 0.33 శాతం చొప్పున లాభాల్లో ట్రేడవుతుండగా, డౌజోన్స్‌ మాత్రం 0.6 శాతం లాభంతో ట్రేడవుతోంది. మార్కెట్‌ ఇప్పటికే పావు శాతం వడ్డీ రేట్లను డిస్కౌంట్‌ చేస్తోంది. మరి అర శాతం తగ్గితే ఈ ర్యాలీ మరికొంత కాలం కొనసాగుతుందని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు.