గ్రీన్‌లో వాల్‌స్ట్రీట్
వాల్‌స్ట్రీట్‌లో ఆరంభంలో ఉన్న ఒక మోస్తరు లాభాలు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం మూడు ప్రధాన సూచీలు నామమాత్రపు లాభాల్లో ఉన్నాయి. నాస్డాక్ ఒక్కటే 0.3 శాతం లాభంతో ఉంది. మిగిలిన రెండు ప్రధాన సూచీల లాభాలు అంతంత మాత్రంగానే ఉంది. ఈ వారాంతంలో వచ్చే ద్రవ్యోల్బణ డేటా కోసం మార్కెట్ ఎదురు చూస్తోంది. గల్ఫ్‌లో సంక్షోభం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు గ్రీన్‌లో ఉన్నాయి. ఈ మార్కెట్లో కూడా ఆరంభ లాభాలు తగ్గాయి. డాలర్ ఇండెక్స్ స్థిరంగా 102పైనే ఉంటోంది. ఇక బులియన్ మార్కెట్లో కూడా స్థిరంగా ఉంది. నష్టాల్లో ఉన్నా.. నామమాత్రంగా ఉన్నాయి.