కోలుకున్న వాల్‌స్ట్రీట్
భారీ అమ్మకాల తరవాత వాల్‌స్ట్రీట్ ఇవాళ కుదురుకుంది. మార్కెట్ ఇవాళ అన్ని సూచీలు ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. ఇటీవల భారీగా క్షీణించిన నాస్‌డాక్‌తో పాటు ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా 1.5 శాతం చొప్పున లాభంతో ట్రేడవుతోంది. డౌజోన్స్ సూచీ కూడా 1.27 శాతం లాభంతో ఉంది. టెక్నాలజీ షేర్లలో యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్ షేర్లు 3 శాతం దాకా పెరిగాయి. రాత్రి భారీగా క్షీణించిన ఫేస్బుక్ ఇవాళ 1.9 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఎస్ అండ్ 500 సూచీలో ప్రాతినిధ్యం వహించే 11రంగాల్లో 8 రంగాల షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బ్యాంక్, ఫైనాన్షియల్ రంగాల షేర్లు కూడా ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. అంతకుముందు యూరో మార్కెట్లు కూడా గణనీయ లాభాలతో ముగిశాయి. డాలర్ ఇండెక్స్ ఇవాళ స్వల్ప లాభంతో ట్రేడవుతోంది.