For Money

Business News

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ‘ఫెస్టివ్‌ ట్రీట్స్‌ 3.0’

పండుగల సీజన్‌లో బిజినెస్‌ కోసం నాన్ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలు, బ్యాంకుల పోటీ పడుతున్నాయి. రకరకాల ఆఫర్స్‌తో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తన్నారు. ఇటీవల యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ పలు ఆఫర్లను ప్రకటించాయి. తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ ‘ఫెస్టివ్‌ ట్రీట్స్‌ 3.0’ పేరుతో 10 వేలకు పైగా ఆఫర్లు ప్రకటించింది.. ఈ సీజన్‌లో రుణాలు తీసుకునే వారికి, కార్డులపై వివిధ వస్తువులు కొనే వారికోసం ఈ ఆఫర్స్‌ అందిస్తున్నట్లు బ్యాంక్‌ పేర్కొంది. పండుగ సీజన్‌లో బిజినెస్‌ పెంచుకునేందుకు 100కు పైగా నగరాలు, పట్టణాల్లోని 10,000 మందికిపైగా వ్యాపారులు, వ్యాపార సంస్థల ఈ ఆఫర్లను అందిస్తోంది. వ్యక్తిగత అవసరాలతో పాటు వ్యాపార అవసరాల కోసమూ ఈ ఆఫర్లను వినియోగించుకోవచ్చని తెలిపింది. బ్యాంక్‌ కార్డుల ద్వారా ప్రీమియం మొబైల్స్‌, వాషింగ్‌ మెషిన్లు, ఫ్రిజ్‌ల కొనుగోలుపై 22.5 శాతం వరకు కాష్‌బాక్‌లతో పాటు నో కాస్ట్‌ ఈఎంఐల సదుపాయం కూడా ఉందని బ్యాంక్‌ తెలిపింది. 10.25 శాతం వడ్డీతో వీటిని ఆఫర్‌ చేస్తున్నట్లు బ్యాంక్‌ వెల్లడించింది.ద్విచక్ర వాహనాల కొనుగోలుకు 100 శాతం, ట్రాక్టర్లకు 90% రుణాన్ని అందించనుంది. హామీ అవసరం లేని వ్యాపార రుణాలను రూ.75 లక్షల వరకు అందిస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రిటైల్‌ అసెట్‌ గ్రూప్‌ హెడ్‌ అరవింద్‌ కపిల్‌ తెలిపారు. మొత్తం 10వేలకు పైగా ఆఫర్లను పండుగల వేళ అందిస్తున్నట్లు డిజిటల్‌ బ్యాంకింగ్‌ గ్రూప్‌ హెడ్‌ పరాగ్‌ రావు చెప్పారు