వాల్‌స్ట్రీట్: కోలుకున్న టెక్ షేర్లు

ఇవాళ ఆరంభం నుంచి వాల్‌స్ట్రీట్ మిశ్రమంగా ఉంది. డౌజోన్స్ నష్టాల్లో ఉండగా నాస్‌డాక్, ఎస్ అండ్ పీ 500 సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. కాని ఎస్ అండ్ పీ 500 సూచీ ఏ క్షణమైనా రెడ్‌లోకి వెళ్ళేందుకు సిద్ధంగా ఉంది. అయితే నాస్‌డాక్ మాత్రం 0.43 శాతం లాభంతో ట్రేడవుతోంది. మరి చివరిదాకా ఈ ట్రెండ్ కొనసాగుతుందా అన్నది చూడాలి. ఇవాళ కూడా కరెన్సీ స్థిరంగా ఉంది. డాలర్ ఇండెక్స్93.57 ప్రాంతంలో ట్రేడవుతోంది. కాని మెటల్స్, క్రూడ్ ఆయిల్ నష్టాల్లో ఉన్నాయి. WTI, బ్రెంట్ క్రూడ్ 2 శాతం నష్టాల్లో ఉన్నాయి. బులియన్ ధరల్లో ఏమాత్రం మార్పు లేదు.