జాబ్ డేటా పాజిటివ్… మార్కెట్ నెగిటివ్
ఉద్యోగ అవకాశాలు సెప్టెంబర్లో పెరిగినట్లు తాజా డేటా తేల్చింది. సెప్టెంబర్ నెలలో ఉద్యోగ అవకాశాలు 50 లక్షలు పెరిగి 1.07కోట్లకు చేరాయి. మార్కెట్ వర్గాలు మాత్రం ఈ నెలలో ఉద్యోగ ఖాళీల సంఖ్య 1.02 కోట్లు మాత్రమే ఉంటాయని ఆశించింది. దీనర్థం.. అమెరికన్ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉందన్నమాట. దీంతో రేపు 0.5 శాతం మాత్రమే వడ్డీ రేట్లను ఫెడ్ పెంచుతుందని అనుకున్న విశ్లేషకులు ఇపుడు తమ అంచనాను మారుస్తున్నారు. 0.75 శాతం పెంచవచ్చని అంటున్నారు. దీంతో ఈక్విటీ మార్కెట్లో లాభాల స్వీకరణ కన్పిస్తోంది. మూడు ప్రధాన సూచీలు అర శాతం నుంచి ముప్పావు శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. డాలర్ స్థిరంగా ఉంది. క్రూడ్ పెరిగింది. బాండ్ ఈల్డ్స్ ఇవాళ స్వల్పంగా క్షీణించాయి. దీంతో ఈక్విటీ మార్కెట్లలో పతనం చాలా తక్కువగా ఉంది.