లాభాల నుంచి నష్టాల్లోకి..
వాల్‌స్ట్రీట్ మిశ్రమంగా ఉంది.యూరో మార్కెట్లన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. జర్మనీ డాక్స్ ఒక శాతంపైగా లాభంతో ఉంది. యూరో స్టాక్స్ 50 సూచీ కూడా ఒక శాతం లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో వాల్‌స్ట్రీట్ గ్రీన్‌లో ప్రారంభమైనా నష్టాల్లోకి జారుకుంది. డైజోన్స్ లాభం 350 పాయింట్ల నుంఇచ వంద పాయిట్లకు పడిపోయింది. ఎస్ అండ్ పీ 500 సూచీ 0.3 శాతం క్షీణించింది. ఇక నాస్‌డాక్ ఒక శాతంపైగా నష్టంతో ఉంది. వడ్డీ రేట్ల పెంపు ఖాయంగా కన్పించడంతో డాలర్ మళ్ళీ ఇవాళ పెరిగింది. చూస్తుంటే డాలర్ ఇండెక్స్ రాత్రికి 99 దాటినా ఆశ్చర్య పోనక్కర్లేదు. డాలర్ లాభంతో బులియన్ నష్టాల్లోకి వెళ్ళాయి. కాని క్రూడ్ మాత్రం మూడు శాతం లాభంతో ట్రేడవుతోంది.