ఆకర్షణీయ లాభాల్లో వాల్‌స్ట్రీట్
డాలర్ కాస్త చల్లబడటం, క్రూడ్ ఆయిల్ కొంత దిగిరావడంతో ఈక్వటీ మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. అన్ని సూచీలు 0.8 శాతం నుంచి 0.9 శాతం మధ్య ట్రేడవుతున్నాయి.ఆరంభంలో నాస్‌డాక్ ఒక శాతంపైగా లాభంతో ఉంది. ఇవాళ యూరో మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమై… తరవాత గ్రీన్‌లోకి వచ్చిన మార్కెట్లు మళ్ళీ నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే నష్టాలు నామమాత్రంగా ఉండటం ఉపశమనం కల్గించే అంశం. నాటో దేశాల తొలి రోజు సమావేశానికి బైడెన్ హాజరు అవుతున్నారు. నాటో నిర్ణయాల కోసం మార్కెట్ ఎదురు చూస్తోంది. కరెన్సీ మార్కెట్‌లో డాలర్ ఇండెక్స్ 98.74 వద్ద ట్రేడవుతోంది. ఇక క్రూడ్ ఆయిల్‌లో బ్రెంట్ రెండున్నర శాతం క్షీణించి 119.19 డాలర్ల వద్ద, WTI క్రూడ్ 112.77 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.