For Money

Business News

ఫెడ్‌ నిర్ణయానికి మార్కెట్‌ సలామ్‌

అమెరికా ఫెడ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ ప్రసంగం తరవాత వాల్‌స్ట్రీట్‌ దౌడు తీసింది. సూచీలన్నీ భారీ లాభాలతో ముగిశాయి. రాత్రి అర శాతం మేర వడ్డీ రేట్లను పెంచిన ఫెడరల్‌ రిజర్వ్‌… మున్ముందు వడ్డీ రేట్ల పెంపులో దూకుడు ఉండదని స్పష్టం చేసింది. దీంతో వాల్‌స్ట్రీట్‌.. ముఖ్యంగా నాస్‌డాక్‌ భారీగా పెరిగింది. అన్ని సూచీలు సుమారు 3 శాతం లాభాలతో ముగిశాయి. టెక షేర్లన్నీ మూడు శాతం నుంచి అయిదు శాతం వరకు పెరిగాయి. ఇటీవల బాగా నష్టపోయిన ఏఎండీ షేర్‌ 9 శాతంపైగా పెరిగింది.ఫెడ్‌ నిర్ణయంతో డాలర్‌ బలహీనపడింది.103 దిగువకు వచ్చిన డాలర్‌ ఇండెక్స్ 102.5 వద్ద ట్రేడవుతోంది. బాండ్‌ ఈల్డ్స్‌ కూడా స్వల్పంగా తగ్గాయి.