వాల్‌స్ట్రీట్ దూకుడు
నాటోలో తనకు సభ్యత్వం అక్కర్లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన ప్రకటన స్టాక్ మార్కెట్లో ఉత్సాహం నింపింది. నాటోలో ఉక్రెయిన్ చేరుతోందనే ఆరోపణలతోనే రష్యా యుద్ధం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటనతో నిన్న యూరో మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బాగా దెబ్బతిన్న మార్కెట్లలో యూరప్ ముందుంది. నిన్న జర్మనీ డాక్స్ 8 శాతం లాభపడిందంటే… మార్కెట్ ఉత్సాహం ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. యూరో స్టాక్స్ 50 సూచీ కూడా 7.44 శాతం లాభంతో ముగిసింది.అదే స్థాయిలో కాకున్నా ఈ ఉత్సాహం రాత్రి వాల్‌స్ట్రీట్‌లో కన్పించింది. కరెన్సీ మార్కెట్లో డాలర్ ఒక శాతంపైగా క్షీణించడంతో ఈక్విటీ మార్కెట్లలో కొనుగోళ్ళు పెరిగాయి. రాత్రి నాస్డాక్ 3.59 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 2.5 శాతం, డౌజోన్స్ 2 శాతం లాభంతో ముగిశాయి. రాత్రి క్రూడ్ ఆయిల్ కూడా బాగానే క్షీణించింది.