For Money

Business News

భారీ లాభాల్లో వాల్‌స్ట్రీట్‌

రుణ సీలింగ్‌పై అధికార, విపక్ష ఎంపీల మద్య ఏకాభిప్రాయం కుదరడంతో అమెరికా మార్కెట్లు పండుగ చేసుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో చాలా నిరాశాజనకంగా ఉన్న నాస్‌డాక్‌ ఇవాళ 1.60 శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. అనేక కీలక టెక్‌ షేర్లకు మద్దతు లభించింది. ఇక క్రూడ్‌ ఆయిల్ పుణ్యమా అని ఎనర్జీ షేర్లు కూడా గ్రీన్‌లో ఉన్నాయి.ఇవాళ డాలర్‌ స్వల్పంగా క్షీణించడంతో క్రూడ్‌ వెంటనే లాభాల్లోకి వచ్చింది. దీంతో డౌజోన్స్‌ కూడా 1.5 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా అదే స్థాయి లాభాలతో సాగుతోంది. డాలర్‌ స్వల్పంగా క్షీణించడంతో క్రూడ్‌ మళ్ళీ 1.5 శాతం లాభంతో ఉంది. ఇక బులియన్‌ మార్కెట్‌లో పెద్దగా కదలికల్లేవ్‌.