వాల్స్ట్రీట్లో జబర్దస్త్ లాభాలు
ఉదయం నుంచి గ్రీన్లోఉన్న అమెరికా ఫ్యూచర్స్ … ఎక్కడా నిరాశపర్చలేదు. వాటి స్థాయిలో అమెరికా సూచీలు ప్రారంభమయ్యాయి. కార్పొరేట్ ఫలితాలు బాగుండటం, క్రూడ్ ధరలు పెరగడంతో ఎనర్జి షేర్లలో జోష్ కన్పించడంతో మూడు ప్రధాన సూచీలు 1.3 శాతం పైగా లాభంతో ట్రేడవుతున్నాయి అంతకుమునుపు యూరప్ మార్కెట్లు కూడా ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. యూరో స్టాక్స్ 50 సూచీ 1.83 శాతం లాభంతో ముగిసింది. దాదాపు ప్రధాన యూరో మార్కెట్లన్నీ ఒక శాతం నుంచి ఒకటిన్నర శాతం లాభఃతో ముగిశాయి. డాలర్ ఇండెక్స్ స్వల్పంగా పెరిగి 104 వద్ద ట్రేడవుతోంది. అమెరికా వారాంతపు క్రూడ్ నిల్వలు మార్కెట్ అంచనాల కంటే బాగా తగ్గాయి. దీంతో క్రూడ్ ఆయిల్ రెండు శాతం పైగా పెరిగింది. బ్రెంట్ క్రూడ్ ఇపుడు 82 డాలర్ల వద్ద ఉంది. బులియన్ ధరల్లో పెద్దగా మార్పు లేదు.