For Money

Business News

రూ. లక్ష కోట్లకు చేరనున్న ఐపీఎల్ విలువ

ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) కామధేనుగా మారింది బీసీసీఐకి. కేవలం ఈ లీగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను శాసించే స్థాయికి ఆర్థికంగా ఎదిగింది బీసీసీఐ. ఈ ఏడాది రెండు కొత్త టీమ్‌లు రావడంతో పాటు మీడియా హక్కులను రికార్డు ధరకు అమ్మడంతో ఐపీఎల్‌ విలువ 1090 డాలర్లకు అంటే రూ. 89,380 కోట్లని కన్సల్టింగ్‌ సంస్థ డీ అండ్‌ పీ అడ్వయిజరీ పేర్కొంది. లక్ష కోట్లకు కేవలం రూ. 10,000 కోట్ల దూరంలో ఉందన్నమాట. ఇదే ట్రెండ్‌ కొనసాగితే ఒకట్రెండు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయలకు చేరుతుందన్నమాట. ”బియాండ్‌ 22 యార్డ్స్‌” పేరుతో తయారు చేసిన ఓ నివేదికలో ఐపీఎల్‌ వ్యాల్యూయేషన్‌ గురించి పేర్కొన్నారు. గత జూన్‌లో కేవలం ఐపీఎల్‌ మీడియా హక్కుల ద్వారా బీసీసీఐకి 620 కోట్ల డాలర్లు (సుమారు రూ. 50,840 కోట్లు) వచ్చిన విషయం తెలిసిందే. ఇక గుజరాత్ టైటాన్స్‌, లక్నో సూపర్‌ గెయింట్స్‌ పేరుతో రెండు కొత్త ఐపీఎల్ ఫ్రాంచైజీల అమ్మకం ద్వారా 160 కోట్ల డాలర్లు అంటే రూ. 13,120 కోట్లు బీసీసీఐకి వచ్చాయి.