For Money

Business News

భారీగా క్షీణించిన అదానీ గ్రూప్‌ షేర్లు

కరోనా వార్తలతో నిఫ్టిలో ఇవాళ ఒత్తిడి వచ్చింది. టెక్నికల్‌గా కూడా మార్కెట్‌ పలు మద్దతు స్థాయిలను కోల్పోతోంది. ఈ నేపథ్యంలో అనేక బ్లూచిప్‌ షేర్లు కూడా క్షీణించాయి. ఇవాళ అదానీ గ్రూప్‌ షేర్లు ఒక మోస్తరు నుంచి భారీ నష్టాలతో ముగిశాయి. మార్కెట్‌ పాజిటివ్‌గా ఉన్న సమయంలో అమాంతంగా పెరిగే ఈ షేర్లు ఇవాళ రివర్స్‌లో అలాగే పడ్డాయి. అదానీ గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజస్‌ షేర్‌ ఇవాళ 6.27 శాతం నష్టపోయి రూ. 3903కి చేరింది. ఆ తరవాత అదానీ విల్మర్‌ షేర్‌ ఏకంగా 5.54 శాతం క్షీణించడంతో ఈ షేర్‌ ధర రూ. 600 దిగువకు వచ్చి రూ. 587.9కి చేరింది. ఇవాళ మార్కెట్‌లో పవర్‌ షేర్లు అన్నీ క్షీణించాయి. అదానీ పవర్‌ కూడా 4.95 శాతం క్షీణించి రూ.290.9ని తాకింది. ఇక అదానీ గ్రీన్‌ ఎనర్జి 4.79 శాతం తగ్గి రూ. 1963కి చేరడం విశేషం. ఇక అదానీ గ్రూప్‌లోని మరో ప్రధాన కంపెనీ అదానీ పోర్ట్స్‌ 3.04 శాతం తగ్గి రూ. 857.30ని టచ్‌ చేసింది. అదానీ ట్రాన్స్‌మిషన్‌ కూడా 2.79 శాతం నష్టంతో రూ. 2614ని తాకగా, 2.11 శాతం నష్టంతో అదానీ టోటల్‌ గ్యాస్‌ షేర్‌ రరూ. 3539కి చేరింది.