For Money

Business News

నాస్‌డాక్‌కు కొనసాగిన మద్దతు

నిన్న రాత్రి వాల్‌స్ట్రీట్‌ భారీగా క్షీణించింది. దాదాపు అన్ని సూచీలు బాగా నష్టపోయాయి. కాని క్లోజింగ్‌ దగ్గర పడే కొద్దీ అనూహ్యంగా కోలుకున్నాయి. అలా కోలుకున్న నాస్‌డాక్‌…. ఇవాళ రోజంతా గ్రీన్‌లో ఉంది… ఫ్యూచర్స్ మార్కెట్‌లో. ఇవాళ కూడా ఓపెనింగ్‌ నుంచి అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. అయితే డౌజోన్స్ స్వల్ప నష్టంలోకి జారుకుంది. ఎస్‌ అండ్‌పీ 500 సూచీదీ అదే పరిస్థితి. నాస్‌డాక్‌ మాత్రం అరశాతంపైగా లాభంతో ఉంది. యూరో మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిసిన నేపథ్యంలో వాల్‌స్ట్రీట్‌ ఎలా ముగుస్తుందో చూడాలి. మరోవైపు ట్రెజరీ బాండ్‌ ఈల్డ్స్‌ ఇవాళ కూడా తగ్గాయి. కాని డాలర్‌ అర శాతం దాకా లాభపడింది. బ్రెంట్‌ క్రూడ్‌ 114 డాలర్ల వద్ద ఉంది. ఇక బులియన్‌ నష్టాల్లో ఉంది .. కాని మరీ భారీ నష్టాలు కాదు.