For Money

Business News

భారీ లాభాల్లో వాల్‌స్ట్రీట్‌

వరుసగా నాలుగు రోజుల నష్టాల తరవాత వాల్‌స్ట్రీట్‌ గ్రీన్‌లోకి వచ్చింది. ఇవాళ విడుదలైన ద్రవ్యోల్బణ రేటు మార్కెట్‌ వర్గాల అంచనా మేరకు ఉండటంతో … బాండ్‌ ఈల్డ్స్‌ క్షీణించాయి. ఏడు రోజుల తరవాత తొలిసారి బాండ్‌ ఈల్డ్స్‌ క్షీణించాయి. అయితే డాలర్‌ మాత్రం పెరుతూనే ఉంది. చాలా టెక్‌ షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. యాపిల్‌, టెస్లా, అమెజాన్‌ రెండు శాతం వరకు పెరగ్గా మైక్రోసాఫ్ట్‌ నామమాత్రపు లాభాలతో ట్రేడవుతోంది. నాస్‌డాక్‌ 1.31 శాతం పెరగ్గా, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.92 శాతం లాభంతో ట్రేడవుతోంది. డౌజోన్స్‌ కూడా 0.72 శాతం పెరిగింది. మార్కెట్‌ ఇప్పటికే 0.5 శాతం వడ్డీని డిస్కౌంట్‌ చేసిందని.. అంతకన్నా ఎక్కువగా పెంచుతారేమోనన్న టెన్షన్‌ ఇవాళ్టి డేటాతో పోయిందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే ఇవాళ పెరిగిన ద్రవ్యోల్బణ రేటులో అధికంగా చమురు ధరలు పెరగడం వల్లనే.. అవి తగ్గితే మళ్ళీ ద్రవ్యోల్బణం క్షీణిస్తుందని ఈ వర్గాలు అంటున్నాయి.