నిలకడగా లాభాల్లో వాల్‌స్ట్రీట్
ఫేస్బుక్ ఆకర్షణీయ ఫలితాలు టెక్, ఐటీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఫేస్బుక్ షేర్ 15 శాతం లాభంతో ట్రేడవుతుండగా, ప్రధాన ఐటీ షేర్లు రెండు శాతం దాకాలాభంతో ట్రేడవుతున్నాయి. టెస్లా ఇవాళ నాలుగు శాతంపైగా నష్టపోయింది. నాస్డాక్ 0.71 శాతం, ఎస్ అండ్ పీ 0.91 శాతం, డౌజోన్స్ 0.49 శాతం లాభాల్లో ఉన్నాయి. జీడీపీ వృద్ధి రేటు అనూహ్యంగా తగ్గినా మార్కెట్ పాజిటివ్‌గా ఉండటం విశేషం. మరి చివరిదాకా ఈ లాభాలు ఉంటాయా అన్నది చూడాలి. అంతకుముందు యూరో మార్కెట్లు ఒక శాతంపైగా లాభంతో ముగిశాయి. యూరో స్టాక్స్ 50 సూచీ 1.13 శాతం లాభంతో ముగిసింది.