For Money

Business News

నష్టాల్లోనే వాల్‌స్ట్రీట్‌

వడ్డీ రేట్లపై అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేపు కీలక నిర్ణయం ప్రకటించనుంది. కనీసం 0.75 శాతం మేర వడ్డీ రేట్లను ఫెడ్‌ పెంచుతుందని మార్కెట్‌ అంచనా వేస్తోంది. ఈ పెంపుదలను మార్కెట్‌ డిస్కౌంట్‌ చేసింది కూడా. అలాగే ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ స్పీచ్‌ కోసం మార్కెట్‌ ఎదురు చూస్తోంది. గత కొన్ని రోజులుగా కాస్త పటిష్ఠంగా ఉన్న గ్రోత్‌ స్టాక్స్‌లో కూడా అమ్మకాల ఒత్తిడి వస్తోంది. డౌజోన్స్‌ 0.73 శాతం క్షీణించింది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా 0.65 శాతం నష్టపోయింది. గత కొన్ని రోజులుగా భారీగా క్షీణించిన నాస్‌డాక్‌ ఇవాళ 0.2 శాతం నష్టాలకే పరిమితమైంది. ఫెడ్‌ నిర్ణయంతో వృద్ధి అవకాశాలు తగ్గుతాయన్న వార్తలతో క్రూడ్‌ ఆయిల్‌ తగ్గుతోంది. వృద్ధి తగ్గితే క్రూడ్‌కు డిమాండ్‌ తగ్గుతుందని మార్కెట్‌ అంచనా. అలాగే డాలర్‌ ఇవాళ కూడా పెరిగింది. ఓపెనింగ్‌లోనే డాలర్‌ ఇండెక్స్‌ 110ని తాకింది. దీంతో క్రూడ్‌ ఆయిల్ 2 శాతం క్షీణించింది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్‌ 90 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.