For Money

Business News

కుప్పకూలిన వాల్‌స్ట్రీట్‌

ఈనెల 25,26వ తేదీలలో ఫెడ్‌ సమావేశం జరుగనుంది. వడ్డీ రేట్లను మార్చిలో పెంచాలన్న నిర్ణయానికి ఫెడ్‌ కట్టుబడి ఉంటుందని భావిస్తున్నారు. దీంతో మార్కెట్‌ వడ్డీ రేట్ల పెరుగుదలను డిస్కౌంట్‌ చేయడం ప్రారంభించింది. బాండ్‌ ఈల్డ్స్‌ ఇవాళ భారీగా పెరగడంతో డాలర్‌ కూడా అరశాతంపైగా పెరిగింది. ఫలితంగా ఓపెనింగ్‌లోనే వాల్‌స్ట్రీట్‌ భారీగా నష్టపోయింది. 11 ప్రధాన టెక్‌ షేర్లలో 10 షేర్లు నష్టాలతో ట్రేడవుతున్నాయి. సాధారణంగా ఐటీ, టెక్‌ షేర్లు పడితే నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌పీ సూచీలు క్షీణిస్తాయి. తాజా సమాచారం మేరకు నాస్‌డాక్‌ రెండు శాతం, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 1.5 శాతం నష్టంతో ట్రేడవుతోంది. అయితే ఇవాళ గోల్డ్‌మన్‌ శాక్స్‌ కూడా నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో బ్యాంకింగ్‌ షేర్లన్నీ నష్టాల్లోకి జారుకున్నాయి. గోల్డ్‌మన్‌ శాక్స్‌ షేర్‌ ఓపెనింగ్‌లోనే 8 శాతం నష్టపోయింది. డీంతో డౌజోన్స్‌ సూచీ కూడా 1.4 శాతం నష్టపోయింది. కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ ఇండెక్స్‌ 0.61 శాతం పెరిగి 95.71 వద్ద ట్రేడవుతోంది.