గ్రీన్‌లో వాల్‌స్ట్రీట్
వడ్డీ రేట్ల పెంపుపై మరికొన్ని గంటల్లో ఫెడ్ తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. 0.75 శాతం పెంపుదలను మార్కెట్ అంచనా వేస్తోంది. తరవాత ఫెడ్ ఛైర్మన్ పావెల్ స్పీచ్ కోసం ఎదురు చూస్తోంది. వడ్డీ రేట్లు పెంపు ఇదే స్థాయిలో ఉండే పావెల్ ప్రసంగం ఏమాత్రంకాస్త సానుకూలంగా ఉన్నా… ఈక్విటీ మార్కెట్లు భారీగా పెరిగే అవకాశముంది. ప్రస్తుతం వాల్‌స్ట్రీట్ గ్రీన్‌లో ఉంది. ప్రధాన సూచీలన్నీ అర శాతంపైగా లాభంతో ఉన్నాయి. అంతకుమునుపు యూరో మార్కెట్లన్నీ లాభాల్లో ముగిశాయి. యూరో స్టాక్స్ 50 సూచీ కూడా 0.72 శాతం పైగా లాభంతో ముగిసింది. డాలర్ ఇండెక్స్ ఇవాళ భారీగా పెరిగింది. 0.6 శాతం పైగా పెరగడంతో డాలర్ ఇండెక్స్ ఇపుడు 110.66 వద్ద ట్రేడవుతోంది. రెండేళ్ళ ట్రెజరీ బాండ్స్ ఈల్డ్స్ 2007 తరవాత తొలిసారి 4శాతానికి చేరాయి. డాలర్ భారీగా పెరగడంతో క్రూడ్ క్షీణించింది. బులియన్ కూడా గ్రీన్‌లో ఉన్నా.. బంగారం లాభాలు పరిమితంగా ఉన్నాయి.