లాభాల్లో వాల్‌స్ట్రీట్
ఇవాళ కూడా వాల్‌స్ట్రీట్ గ్రీన్‌లో ఉంది. నాస్డాక్ 0.71 శాతం పెరగ్గా, ఎస్ అండ్ పీ 500 సూచీ 0.45 శాతం లాభంతో ట్రేడవుతోంది. డౌజోన్స్ అతి తక్కువగా 0.01 శాతం లాభంతో ఉంది. అంటే క్రితం ముగింపు వద్దే ఉందన్నమాట. యూరో మార్కెట్లు మాత్రం స్థిరంగా ముగిశాయి. కొన్ని లాభాల్లో, మరికొన్ని నష్టాల్లో ముగిసినా… అవి నామమాత్రమే. మరోవైపు డాలర్ తగ్గినట్లే తగ్గి… మళ్లీ క్రితం స్థాయికి వచ్చింది. మరోవైపు ఇరాన్ నుంచి ఎగుమతులు పెరుగుతాయన్న వార్తలతో క్రూడ్ స్వల్పంగా తగ్గినా… బ్రెంట్ క్రూడ్ 101 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక బులియన్ ధరల్లో పెద్ద మార్పు లేదు. జాక్సన్ హోల్ సెమినార్లో ఫెడరల్ రిజర్వ్ గవర్నర్లు మాట్లాడుతారు. వారిప్రసంగాలను బట్టి వచ్చే నెలలో వడ్డీ రేట్ల పెంపు ఏ స్థాయిలో ఉంటుందో చూచాయగా అంచనా వేయొచ్చు. దీంతో మార్కెట్ ఫెడరల్ రిజర్వ్ చీఫ్ ప్రసంగం కోసం ఎదురు చూస్తోంది.