గ్రీన్‌లో వాల్‌స్ట్రీట్… క్రూడ్ జూమ్
దిగువస్థాయిలో అమెరికా మార్కెట్లకు కాస్త మద్దతు లభిస్తోంది. యూరో మార్కెట్లన్నీ ఒకటి నుంచి ఒకటిన్నర శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. డాలర్ స్వల్పంగా పెరిగింది. ఈ నేపథ్యంలో అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. డౌజోన్స్ ఇవాళ ఒక శాతంపైగా లాభంతో ఉంది. ఎస్ అండ్ పీ 500 సూచీ, నాస్‌డాక్ కూడా 0.8 శాతం పైనే ట్రేడవుతున్నాయి. కరెన్సీ మార్కెట్‌లో డాలర్ కాస్త పటిష్ఠంగా ఉంది. ఇక ఒమైక్రాన్ భయాలు కాస్త తగ్గడంతో క్రూడ్ మళ్ళీ పుంజుకుంది. అమెరికా క్రూడ్ WTI మూడు శాతం పెరగ్గా, బ్రెంట్ క్రూడ్ రెండు శాతం లాభంతో ట్రేడవుతోంది. బ్రెంట్ క్రూడ్ 73.5 డాలర్లకు చేరుకుంది.