టెస్లా జూమ్….లాభాల్లో వాల్‌స్ట్రీట్
అంతర్జాతీయ మార్కెట్లు ప్రస్తుత స్థాయిల వద్ద నిలకడగా ట్రేడవుతున్నాయి. ఏ మార్కెట్లోనూ జోష్‌లేదు. ఇవాళ వాల్‌స్ట్రీట్‌లో కేవలం నాస్డాక్ ఒక్కటే అర శాతం లాభంతో ట్రేడవుతోంది. మిగిలిన సూచీలు అంతంత మాత్రమే. డౌజోన్స్ లాభాల్లో క్లోజ్ అవుతుందా లేదా అన్నది అనుమానమే. ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా 0.3 శాతం లాభంతో ట్రేడవుతోంది. హెర్జ్ కంపెనీ ఏకంగా లక్ష టెస్లా కార్లకు ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటికే ఆర్డర్ల మేరకు డెలివరీ ఇవ్వలేకపోతున్న టెస్లాకు ఇదొక బూస్ట్. దీంతో ఈ కంపెనీ షేర్ 7.5 శాతం పెరిగింది ఇవాళ. మరోవైపు డాలర్ ఇవాళ కాస్త గ్రీన్‌లో ఉంది. అయినా క్రూడ్ ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. బ్రెంట్ క్రూడ్ 86 డాలర్లను దాటనుంది. బులియన్ కూడా గ్రీన్‌లో ఉంది. బంగారం మళ్ళీ 1800 డాలర్లను దాటింది. వెండి కూడా పరవాలేదు.