ఒమైక్రాన్ దెబ్బకు వాల్‌స్ట్రీట్ విలవిల
వాల్‌స్ట్రీట్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. గత శుక్రవారం ఒక మోస్తరు నష్టాలతో ముగిసిన సూచీలు ఇవాళ భారీ నష్టాలతో ఉన్నాయి. యూరో మార్కెట్లు కూడా 1.5 శాతం నుంచి 2 శాతం వరకు నష్టాల్లో ఉన్నాయి. ఆరంభం నుంచి వాల్‌స్ట్రీట్‌లో ఒత్తిడి కన్పిస్తోంది. డౌజోన్స్, ఎస్ అండ్ పీ 500 సూచీతో పాటు నాస్‌డాక్ కూడా 1.85 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. ఫైనాన్స్, బ్యాంకింగ్‌తో పాటు ఎనర్జీ షేర్లు కూడా భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఒమైక్రాన్ భయం మార్కెట్‌ను వెంటాడుతోంది. మళ్ళీ అనేక దేశాల్లో లాక్‌డౌన్ ఖాయమనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థికవృద్ధి రేటు తగ్గే అవకాశముందని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించకున్నా… ఉద్దీపన ప్యాకేజీకి మద్దతు తగ్గించాలని నిర్ణయిచడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.