For Money

Business News

వాల్‌స్ట్రీట్‌కు మాంద్యం కుదుపు

ప్రపంచ ఈక్విటీ మార్కెట్లన్నీ భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. అమెరికాకు చెందిన మూడు ప్రధాన సూచీలు స్పష్టంగా బేర్‌ ఫేజ్‌లోకి వెళ్ళిపోయాయి. ముఖ్యంగా డౌజోన్స్‌ రోజూ ఒక శాతంపైగా క్షీణించడం.. ఈక్విటీ ఇన్వెస్టర్లను కలవరపరుస్తోంది. నాస్‌డాక్‌ భారీగా నష్టపోతున్నా… డౌజోన్స్ చాలా పటిష్ఠంగా ఉండేది. కాని గత కొన్ని రోజుల నుంచి గ్రోత్‌ స్టాక్స్‌ అన్నీ బాగా పడుతున్నాయి. ద్రవ్యోల్బణం కట్టడి చేయడమే తమ ప్రధాన కర్తవ్యమని ఫెడ్‌ అధికారులు పదే పదే స్పష్టం చేయడంతో ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. డాలర్‌ ఇవాళ కూడా ఒక మోస్తరుగా నష్టపోయింది. 114 నుంచి 112కు పడింది డాలర్‌ ఇండెక్స్‌. అయితే క్రూడ్‌ ఆయిల్ ధరలు తగ్గకుండా తాము చర్యలు తీసుకుంటామని ఒపెక్‌ ప్రకటించింది. అవసరమైతే వచ్చేవారం సమావేశంలో ఉత్పత్తిని తగ్గించి సరఫరా అదుపు చేస్తామని ఒపెక్‌ దేశాలు అన్నాయి. దీంతో బ్రెంట్‌ క్రూడ్‌ ఇవాళ దాదాపు 90 డాలర్లను తాకింది. మరోవైపు పదేళ్ళ అమెరికా ట్రెజరీ బాండ్స్‌ ఈల్డ్స్‌ ఒక శాతం దాకా పెరిగి 3.74 శాతాన్ని దాటాయి. మరోవైపు యూరో మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. యూరో స్టాక్స్‌ 50 సూచీ 1.69 శాతం నష్టంతో క్లోజైంది. బులియన్‌ మార్కెట్‌లో ఎలాంటి కదలిక లేదు.