For Money

Business News

వెంటాడుతున్న వడ్డీ రేట్ల భయాలు

ఒకవైపు ఆర్థిక వ్యవస్థ జెట్‌ స్పీడుతో దూసుకుపోతోందని, ధరలు 40 ఏళ్ళ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయని డేటా వస్తుండగా.. మరోవైపు ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు వెళుతోందన్న సంకేతాలు వస్తున్నాయి. ఇవాళ జేపీ మోర్గాన్‌, మోర్గాన్‌ స్టాన్లీ కంపెనీలు త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. రెండు కంపెనీలు నిరాశాజనక ఫలితాలు ప్రకటించాయి. దీంతో మున్ముందు మరిన్ని కంపెనీలు ఈ తరహా ఫలితాలను ప్రకటిస్తాయన్న అంచనాలు ప్రారంభమయ్యాయి. వృద్ధిరేటు మందిగిస్తుందన్న అంచనాతో క్రూడ్‌ ఆయిల్‌ ఇవాళ మరో రెండు శాతం క్షీణించింది. దీంతో వాల్‌స్ట్రీట్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి.డాలర్ ఇండెక్స్‌ 108.5 వద్ద పటిష్ఠంగా ఉంది. ముఖ్యంగా గ్రోత్‌స్టాక్స్‌లో వచ్చిన ఒత్తిడి వల్ల డౌజోన్స్‌ ఒకటిన్నర శాతం పైగానష్టంతో ఉంది. నాస్‌ డాక్‌, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు ఒకశాతంపైగా నష్టంతో ఉన్నాయి. ఈనెల 26,27 తేదీలో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం కానుంది. ఈసారి కేంద్ర బ్యాంక్‌ ఏకంగా ఒక శాతం మేర వడ్డీ రేట్లను పెంచతుందని భావిస్తున్నారు.