For Money

Business News

అమ్మకాల హోరు…

మున్ముందు వడ్డీ రేట్ల పెంపులో దూకుడు ఉండని ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్ చెప్పిన మాటలతో నిన్న అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసింది. ఇప్పటికే బేర్‌ ఫేజ్‌లో వచ్చిన నాస్‌డాక్‌… ఇక బాటమ్‌ ఔట్‌ అవుతోందని అనుకున్నారు అనలిస్టులు. ఇవాళ చాలా అంశాలు ఒకే రోజు రావడంత మార్కెట్‌ ఘోరంగా దెబ్బతింది. నిరుద్యోగ భృతి కోసం వచ్చిన దరఖాస్తుల సంఖ్య మార్కెట్‌ అంచనాలకు మించి ఉంది. ఉత్పాదకత బాగా తగ్గింది. డాలర్‌ చాలా రోజుల తరవాత ఒక శాతం మించి పెరిగింది. దీంతో డాలర్‌ ఇండెక్స్‌ 103.8కి చేరింది. ఇక పదేళ్ళ బాండ్‌ ఈల్డ్స్‌ మళ్ళీ 3 శాతాన్ని దాటాయి. ఇన్ని ప్రతికూలతలు ఒకేసారి రావడంతో టెక్‌ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ప్రధాన టెక్‌, ఐటీ షేర్లు నాలుగు శాతం నుంచి 8 శాతం దాకా పడ్డాయి. దీంతోనాస్‌డాక్‌ 4.6 శాతం క్షీణించింది. ఇక ఎస్‌అండ్‌పీ 500 నష్టాలు 3.5 శాతంపైనే. ఇక డౌజోన్స్‌ కూడా 2.92 శాతం పడిందంటే… మార్కెట్‌లో అమ్మకాల జోరు ఎలా ఉందో ఊహించవచ్చు. మరి మార్కెట్‌ క్లోజింగ్‌ సమాయానికి ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే యూరో మార్కెట్లు సాధారణ నష్టాలతోనే ముగిశాయి. అమెరికా మార్కెట్లు ప్రారంభమయ్యాక నష్టాలు తగ్గాయి.