ఫెడ్ నిర్ణయం ముందు… అమ్మకాల జోరు
భారత కాలమాన ప్రకారం అర్ధరాత్రి తరవాత అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తన నిర్ణయం ప్రకటించనుంది. కరోనా సమయంలో ఫెడరల్ రిజర్వ్ ప్రారంభించిన ఉద్దీపన ప్యాకేజీని షెడ్యూల్ కన్నా ముందే ముగించే అవకాశాలు అధికంగా కన్పిస్తున్నాయి. అంటే బాండ్ల కొనుగోలును చాలా తొందరగా నిలిపేయనుంది. అలాగే వడ్డీ రేట్లను పెంపు షెడ్యూల్‌ను ముందుకు జరిపే అవకాశముంది. బహుశా ఈ అంశాలను మార్కెట్ డిస్కౌంట్ చేసినట్లు కన్పిస్తోంది. వాల్‌స్ట్రీట్‌లో ఇవాళ అన్ని సూచీలు నష్టాల్లో ఉన్నాయి. నాస్‌డాక్ మరో అరశాతం నష్టంతో ట్రేడవుతోంది. మిగిలిన సూచీలు నష్టాల్లో ఉన్నాయి. కరెన్సీ మార్కెట్‌లో డాలర్ నిలకడగా ఉంది. క్రూడ్ ఆయిల్ ఇవాళ మరో ఒక శాతం నష్టపోయింది. బులియన్ వెండి నష్టాలు జోరుగా ఉన్నాయి.