For Money

Business News

మళ్ళీ భారీ పతనం

వాల్‌ స్ట్రీట్‌ రికవరీ ఒకరోజు ముచ్చటగా మారిపోయింది. ఇవాళ కూడా ఐటీ, టెక్‌ షేర్లలో భారీ ఒత్తిడి వచ్చింది. నాస్‌డాక్‌ ఇవాళ కూడా 2.71 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 1.88 శాతం నష్టంతో ట్రేడవుతోంది. మరోవైపు క్రూడ్‌ ఆయిల్‌ ధరలు భారీగా పెరుగుతున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 87 డాలర్లకు చేరువైంది. అలాగే డాలర్ మరింత బలపడింది. డాలర్ ఇండెక్స్‌ 96 దాటింటి. ఈ నేపథ్యంలో ఎనర్జీ షేర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. దీంతో డౌజోన్స్ నష్టాలు తక్కువగా ఉన్నాయి. ఇపుడు డౌజోన్స్‌ సూచీ 1.02 శాతం నస్టంతో ట్రేడవుతోంది. ఇవాళ్టి నుంచి ఫెడరల్‌ బ్యాంక్‌ సమావేశాలు ప్రారంభమౌతాయి. రేపు రాత్రికి ఫెడ్‌ తన నిర్ణయాలను ప్రకటిస్తుంది. అప్పటి వరకు మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగే అవకాశాలు ఉన్నాయి.