For Money

Business News

నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌తో అనూష్క రూ.400 కోట్ల డీల్‌

నటి అనూష్క శర్మ, ఆమె సోదరుడు కర్నేష్‌ శర్మ కలిసి స్థాపించిన క్లీన్‌ స్లేట్‌ ఫిలిమ్స్‌ కంపెనీ నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌లతో భారీ డీల్‌ కుదుర్చుకుంది. 8 సినిమాలు, వెబ్‌ సిరీస్‌ చేసేందుకు ఆ రెండు ఓటీటీ కంపెనీలతో రూ. 400 కోట్ల డీల్‌ను క్లీన్‌ స్లేట్‌ ఫిలిమ్స్‌ ఓకే చేసింది. గతంలో నెట్‌ఫ్లిక్స్‌లో ‘బల్బుల్’, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘పాతాల్ లోక్’ సినిమాలను క్లీన్‌ స్లేట్‌ ఫిలిమ్స్‌ విడుదల చేసింది. ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి 2015లో ‘ఎన్‌హెచ్10’చ ఫిలౌరి, పరి అనే చిత్రాలను తీసింది. తృప్తి దిమ్రితో కలా, ఇర్ఫాన్‌ ఖాన్‌ కుమారుడు బాబిల్‌, అనూష్కాతో ‘చక్దా ఎక్స్‌ప్రెస్’ చిత్రాలు విడుదల కానున్నాయి.