నష్టాల్లోకి జారుకున్న వాల్‌స్ట్రీట్
ఉదయం నుంచి ఆకర్షణీయ లాభాల్లో ఉన్న వాల్‌స్ట్రీట్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే నష్టాల్లోకి జారుకుంది. ఆరంభంలో ఒక శాతం దాకా లాభంలో ఉన్న నాస్డాక్ ఇపుడు 0.14 శాతం నష్టంతో ఉంది. ఐటీ, టెక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కాస్త తగ్గినట్లు కన్పిస్తోంది. దిగువ స్థాయిలో వీటికి మద్దతు లభిస్తోంది. అయితే ఎస్ అండ్ పీ 500 సూచీతో పాటు డౌజోన్స్‌లో తీవ్ర ఒత్తిడి వస్తోంది. ముఖ్యంగా డౌజోన్స్ ఇవాళ కూడా 0.55 శాతం నష్టపోవడంతో… ఈ సూచీ కూడా బేర్ ఫేజ్‌లోకి వచ్చినట్లుగా అనలిస్టులు భావిస్తున్నారు. గరిష్ఠ స్థాయి నుంచి ఈ సూచీ కూడా 20 శాతం పైగా నష్టపోయింది. కరెన్సీ మార్కెట్లో డాలర్‌కు తిరుగే లేకుండా పోయింది. ఇవాళ మరింత పెరిగి 114ని క్రాస్ చేసింది డాలర్ ఇండెక్స్. మరోవైపు డాలర్‌తో పాటు క్రూడ్ పెరగడంతో మన మార్కెట్లకు మైనస్‌గా చెప్పొచ్చు. బ్రెంట్ క్రూడ్ ఇపుడు 84.45 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక బులియన్ మార్కెట్లో ఒత్తిడి కొనసాగుతోంది. కాకపోతే నష్టాలు స్వల్పంగా ఉండటం ఊరట కల్గించే అంశం.