నష్టాల నుంచి లాభాల్లోకి….
ఉదయం నుంచి అమెరికా ఫ్యూచర్స్ నష్టాల్లో ఉన్నాయి. సాయంత్రం అమెరికా మార్కెట్లు ప్రారంభంలో కూడా నష్టాల్లో ఉన్నాయి. జీడీపీ వృద్ధి రెటు వరుసగా రెండో త్రైమాసికంలో కూడా క్షీణించడంతో మాంద్యం వచ్చేసినట్లే అన్న వార్తల నేపథ్యంలో మార్కెట్లు డల్‌గా ఉన్నాయి. కాని కొద్దిసేపటి క్రితం మూడు ప్రధాన సూచీలు గ్రీన్‌లోకి వచ్చాయి. మూడూ అర శాతం లాభంతో ట్రేడ్ కావడం విశేషం. అలాగే నష్టాల్లో ఉన్న యూరో మార్కెట్లు కూడా లాభాల్లోకి వచ్చేసింది. ఇవాళ అమెరికా ప్రభుత్వ పదేళ్ళ ట్రెజరీ బాండ్స్‌పై ఈల్డ్స్ తగ్గడం వినా… అన్ని సూచీలు గ్రీన్ ఉన్నాయి. పెద్దగా లాభాలు లేకున్నా డాలర్ గ్రీన్‌లో ఉంది. క్రూడ్ ధరలు కూడా ఒక శాతం వరకు లాభాల్లో ఉన్నాయి. ఇక బులియన్ కూడా గ్రీన్‌లోనే.ముఖ్యంగా బులియన్ రెండు శాతం పెరగ్గా, వెండి ఏడు శాతం వరకు పెరిగింది. కాపర్‌తో పాటు ఇతర మెటల్స్ కూడా గ్రీన్‌లో ఉన్నాయి.