కుప్పకూలిన అమెరికా మార్కెట్లు
అమెరికాలో వడ్డీ రేట్ల పెంపునకు రంగం సిద్ధమైంది. రాత్రి వెలువడిన అమెరికా ఫెడరల్ రిజర్వ్ మినిట్స్ తరవాత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. గడచిన పది నెలల్లో ఎన్నడూ లేనివిధంగా నాస్డాక్ మూడు శాతంపైగా నష్టంతో ముగిసింది. టెక్ షేర్లు ఉండే ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా రెండు శాతం నష్టపోయాయి. ఇక ఉదయం నుంచి లాభాల్లో ఉన్న డౌజోన్స్ ఒక శాతంపైగా నష్టపోయింది. ఇది వరకు అనుకన్న షెడ్యూల్ కన్నా ముందే వడ్డీ రేట్లను పెంచవచ్చని ఫెడరల్ రిజర్వ్ మినిట్స్‌తో వెల్లడైంది. దీంతో రాత్రి అమెరికా డాలర్ లాభాలతో ముగిసింది. డాలర్ ఇండెక్స్ మళ్ళీ 96పైన ట్రేడవుతోంది. క్రూడ్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి ఉన్నా… బ్రెంట్ క్రూడ్ 80 డాలర్ల ప్రాంతంలో ట్రేడవుతోంది.