For Money

Business News

నష్టాల్లో ముగిసిన వాల్‌స్ట్రీట్

నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. నాస్‌డాక్‌తో పాటు ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా 0.91 శాతం క్షీణించాయి. డౌజోన్స్‌ మాత్రం 0.48 శాతం నష్టంతో ముగిసింది. ఉద్దీపన ప్యాకేజీ సహాయం తగ్గింపు తొందర్లోనే ప్రారంభమౌతుందని స్టాక్‌ మార్కెట్‌ నిపుణలు అంచనా వేస్తున్నారు. కన్జూమర్స్‌ గూడ్స్‌కు పెరుగుతున్న డిమాండ్‌ చూస్తుంటే.. వడ్డీరేట్లను కూడా అనుకున్న సమయంకంటే ముందే పెంచే అవకాశాలు కన్పిస్తున్నాయి.దీంతో కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ బలపడుతోంది. అయితే సరఫరా పెరగక పోవచ్చన్న వార్తలతో క్రూడ్‌ నిలకడగా ఉంది. రాత్రి ఒక మోస్తరుగా క్షీణంచిన క్రూడ్‌ కోలుకుంది. డాలర్‌ పెరుగతూ క్రూడ్‌ కూడా అధిక స్థాయిలో ఉండటం భారత్‌ వంటి మార్కెట్లకు ప్రతికూలం అంశమే.