కొనేందుకు రైట్ టైమ్ కాదు
మార్కెట్ ఇవాళ భారీ లాభాలతో ప్రారంభం కానుంది. ఈ స్థాయిలో కొనుగోలు చేయొద్దని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుదర్శన్ సుఖాని అన్నారు. గత బుధవారం నుంచి నిఫ్టిని కొనుగోలు చేయాలని సుఖాని సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పొజిషన్స్ ఉన్న వారు స్ట్రిక్ట్ స్టాప్‌లాస్‌తో పొజిషన్ కొనసాగించవచ్చని అన్నారు.నిఫ్టి 16000 స్థాయి తాకొచ్చని, అయితే కొనడానికి ఇది సరైన సమయం కాదన్నారు. నిఫ్టి 15700 వరకు నిఫ్టి పడే దాకా కొనుగోలు చేయొద్దని ఆయన అన్నారు. ఐసీఐసీఐ బ్యాంక్, డాబర్, ఏయూ బ్యాంక్ షేర్లను కొనుగోలు చేయాలని ఆయన సిఫారసు చేశారు. హిందాల్కో అమ్మాలని పేర్కొన్నారు. మరో స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మితేష్ ఠక్కర్ సీఎన్‌బీసీ టీవీ18 ఛానల్‌తో మాట్లాడుతూ 15820 స్టాప్‌లాస్‌తో పొజిషన్స్‌ను కొనసాగించవచ్చని ఆయన సలహా ఇచ్చారు. అమరరాజా బ్యాటరీస్, బాష్ షేర్లను కొనుగోలుకు ఆయన సలహా ఇచ్చారు.