1న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలుఉ ఈనెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. తరువాతి రోజు అంటే ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఈసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. ఫిబ్రవరి 9 వరకు బడ్జెట్ సమావేశాలు తెలుస్తోంది. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించనున్నారు. ఈసారి ఆకర్షణీయమైన ప్రకటనలు, విధానపరంగా కీలకమైన మార్పులు ఉండకపోవచ్చని ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.