నిఫ్టి పెరిగినపుడల్లా…అమ్మకాలే
ఇవాళ మార్కెట్ మొత్తం ఎనిమిది సార్లు లాభాల్లో నుంచి నష్టాల్లోకి జారుకుంది. డే ట్రేడర్లకు కాసుల వర్షం కురిపించిన ఇవాళ్టి ట్రేడింగ్ పూర్తిగా ఆల్గో లెవల్స్‌కు లోబడి సాగింది. 17524 కనిష్ఠ స్థాయి, 17610 గరిష్ఠ స్థాయిల మధ్య కదలాడిన నిఫ్టి డే ట్రేడర్స్‌కు మంచి లాభాలను అందించింది. మొత్తానికి స్వల్ప 15 పాయింట్ల నష్టంతో 17,546 వద్ద ముగిసింది. అంటే మార్కెట్ స్థిరంగా ముగిసిందన్నమాట. కాని వాస్తవ మార్కెట్ భిన్నంగా ఉంది. బ్యాంక్ నిఫ్టి 0.8 శాతం దాకా నష్టపోతే… మిడ్ క్యాప్ షేర్ల సూచీ ఏకంగా 2.74 శాతం పెరిగింది. అనేక ఐటీ, మీడియా షేర్లు ఇవాళ భారీగా పెరిగాయి. ఇక మిడ్ క్యాప్ రియాల్టి షేర్లు కూడా ఇవాళ వెలుగులో ఉన్నాయి.
నిఫ్టి టాప్ గెయినర్స్
కోల్ ఇండియా 162.05 3.61
టెక్ మహీంద్రా 1,514.00 3.58 హిందాల్కో 463.30 2.73 టాటా మోటార్స్ 310.00 2.67
ఎం అండ్ ఎం 752.90 1.96
నిఫ్టి టాప్ లూజర్స్
నెస్లే ఇండియా 19,893.60 -1.47
హెచ్‌డీఎఫ్‌సీ 2,737.00 -1.35
ఐసీఐసీఐ బ్యాంక్ 703.50 -1.17
ఓఎన్‌జీసీ 133.65 -1.15
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1,536.05 -1.02